: భారీ వేతనాల్లో టెక్‌​ మహీంద్రా సీఈవోకి టాప్ ర్యాంక్!

గత మూడేళ్లలో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలతో పోల్చుకుంటే టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని భారీ వేతనం అందుకున్నట్టు ఓ నివేదిక చెబుతోంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల్లో అత్యధికంగా వేతనాలు పొందే ఎగ్జిక్యూటివ్ ల వివరాలను వీపీ సర్కిల్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, టెక్ మహీంద్రాకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తున్న గుర్నాని మూడేళ్లలో రూ.150.7 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు వెల్లడైంది.

2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కూడా టాప్-3 కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సీఈఓల కన్నా గుర్నాని అందుకున్న పరిహారాలు ఎక్కువేనట. గుర్నాని పారితోషికాల్లో అధికశాతం రూ.147.17 కోట్లు స్టాక్ ఆప్షన్ల నుంచి వస్తున్నట్టు తెలిసింది. కాగా, టాటా సన్స్ చైర్మన్, టీసీఎస్ మాజీ సీఈఓ చంద్రశేఖరన్ పారితోషికాలు రూ.30.15 కోట్లకు పెరిగాయి. ఇన్ఫోసిన్ సీఈఓ విశాల్ సిక్కా వేతనం స్వల్పంగా తగ్గి రూ.45.11 కోట్లుగా ఉంది.

More Telugu News