: ఇది క‌చ్చితంగా రాజ‌కీయ కుట్రే: లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌

ఈ రోజు త‌న ఇంట్లో జ‌రిగిన సీబీఐ సోదాల‌పై రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ స్పందించారు. ఈ సీబీఐ సోదాలు బీజేపీ ప్ర‌భుత్వం వారి రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని ఆయ‌న చెప్పారు. 2006లో హోట‌ల్ టెండ‌ర్ కేసు గురించి లాలూ మీడియాతో మాట్లాడారు. ఆ కేసులో త‌న త‌ప్పేంలేద‌ని, అంతా ప‌ద్ధ‌తిగానే జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. `బీజేపీ క‌నుస‌న్న‌ల్లో న‌డిచే సీబీఐ` అంటూ ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. లాలూపై ఉన్న అవినీతి కేసుల విచార‌ణ‌లో భాగంగా ఇవాళ ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికి చెందిన 12 ప్ర‌దేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఇదిలా ఉండ‌గా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇంట్లో జ‌రిగిన‌ సీబీఐ సోదాలతో ప్ర‌భుత్వానికి గానీ, బీజేపీకి గానీ ఎలాంటి సంబంధం లేద‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు.

More Telugu News