: 25 మందిని పీకేయమన్న పీకే... వైకాపా నేతల్లో టెన్షన్!

2019లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, జగన్ వద్ద చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో పలువురికి ప్రజాదరణ లేదని, వారికి సీట్లు కేటాయిస్తే, గెలిచే అవకాశాలు ఉండవని, మరో మంచి అభ్యర్థిని చూసుకోవాలని ఆయన చెప్పడంతో, ఆ 25 మంది ఎవరా అన్న కొత్త చర్చ మొదలైంది.

గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను ఇవ్వడం వల్ల వైకాపా నష్టపోయిందని, ఈ దఫా అలా జరుగకుండా చూసుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైకాపాలో ఉండగా, వారిలో దాదాపు 25 మంది పేర్లను వెల్లడించిన ఆయన, వారిని దూరం పెట్టాలని పేర్కొన్నారని సమాచారం. ఇక ఎవరి పేర్లున్నాయన్న విషయమై చర్చ హల్ చల్ చేస్తుండగా, చాలామంది ఎమ్మెల్యేలకు ప్రజాదరణ గత ఎన్నికలతో పోలిస్తే, 2 నుంచి 10 శాతం వరకూ తగ్గినట్టు పీకే టీమ్ చేసిన రహస్య సర్వేలో తేలినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీ తరువాత పార్టీలో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది.

More Telugu News