: అక్టోబర్లో గోవాలో చైతూ, సమంతల మూడు రోజుల పెళ్లి.. తెలుగు, తమిళ సినీ ప్రముఖుల హాజరు!

అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాగచైతన్య, సమంతల వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 6న చైతూ, సమంతల వివాహం గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథమహారథులతోపాటు, నాగ్ తో మంచి సంబంధాలు కలిగిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో వివాహ వేడుక కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో జరగనున్న ఈ వివాహ వేడుకలు ఆహూతులను అలరిస్తాయని ఫిల్మ్ నగర్ భోగట్టా. అనంతరం 40 రోజుల హానీమూన్ కు ఇద్దరూ అమెరికాలోని న్యూయార్క్ కు వెళ్లనున్నారని సమాచారం.

More Telugu News