: మైక్రోసాఫ్ట్ సేల్స్ విభాగంలో భారీగా ఉద్యోగాల కోత‌!

ప‌ర్మినెంట్ సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా టెక్నాల‌జీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్, త‌మ సేల్స్ విభాగంలో ఉద్యోగాల‌పై భారీగా కోత విధించింది. వీరిలో ఎక్కువ మంది అమెరికాకు వెలుప‌ల ప‌నిచేస్తున్నారు. వీరంద‌రికి ఇప్ప‌టికే నోటీసులు కూడా పంపించిన‌ట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో ప‌నిచేస్తున్న‌ వారి సంఖ్య 1,21,500. వీరిలో దాదాపు 71,600 మంది అమెరికాలో ప‌నిచేస్తున్నారు. ఎంఎస్ ఆఫీస్ లైసెన్సింగ్ విధానంలో పాత ప‌ద్ధ‌తికి స్వ‌స్తి ప‌లికి కొత్త స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల సేల్స్ విభాగంలో ఉద్యోగుల అవ‌స‌రం త‌గ్గింద‌ని, అందుకే అక్క‌డి పెట్టుబ‌డి త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని మైక్రోసాఫ్ట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

More Telugu News