: ట్రంప్ తో చెయ్యి కలిపేందుకు నిరాకరించిన పోలెండ్ అధ్యక్షుడి సతీమణి... మీరూ చూడండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కరచాలనం చేసేందుకు నిరాకరించిన పోలెండ్ అధ్యక్షుడు ఆండ్ర్ జెజ్ దువా సతీమణి కోర్న్ హౌజర్ దువా వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ట్రంప్, ఆయన భార్య మెలానియాలను దువా జంట స్వాగతం పలుకుతున్న వేళ ఈ ఘటన జరిగింది. తొలుత ఆండ్ర్ జెజ్ కు షేక్ హ్యాండిచ్చిన ట్రంప్, ఆపై తన చేతిని హౌజర్ వైపు చాచగా, ఆమె మాత్రం మెలానియా దగ్గరకు వెళ్లిపోయి, కరచాలనం చేసి కుశలమడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, మిలియన్ల కొద్దీ రీట్వీట్లు, లైక్స్ తెచ్చుకుంది. దీనిపై స్పందించిన ఆండ్ర్ జెజ్, ట్రంప్ చేయి చాచిన విషయాన్ని తన సతీమణి గమనించలేదని, ఇది చాలా చిన్న ఘటనని, ఇటువంటి తప్పుడు వార్తలపై యుద్ధం చేయాలని వ్యాఖ్యానించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News