: మారుతున్న బీహార్ రాజకీయం... అత్యవసర సమావేశం పెట్టుకున్న నితీశ్

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ లపై సీబీఐ కేసుల్లో భాగంగా, ఈ ఉదయం నుంచి సోదాలు జరుగుతూ ఉండటంతో, డీజీపీ, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలతో నితీశ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. బీహార్ లో మహాకూటమి ప్రభుత్వం కొనసాగుతుండగా, లాలూ ప్రసాద్ వ్యవహారం ప్రభుత్వం మెడకు చుట్టుకునేలా ఉండటంతోనే, పరిస్థితిని సమీక్షించేందుకు ఆయనీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఒక్క లాలూ నివాసంలో 12 మంది అధికారులు సోదాలు చేస్తుండగా, పట్నాతో పాటు రాంచీ, పూరి, గురుగ్రామ్ సహా మరో 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లాలూకు నెమ్మదిగా దూరమవుతూ, ప్రధాని మోదీకి దగ్గరవుతున్న నితీశ్, తాజా పరిణామాలతో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చన్న ఊహాగానాలూ వస్తున్నాయి. మారుతున్న బీహార్ రాజకీయ పరిణామాలను విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు.

More Telugu News