: మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు.. మెసేజ్ పెట్టడంతో కాపాడిన పోలీసులు!

హైదరాబాదు నుంచి వరంగల్ వస్తున్న క్యాబ్ లో అత్యాచారయత్నం చేస్తున్నారంటూ మహిళ మెసేజ్ పెట్టడంతో వేగంగా స్పందించిన పోలీసులు, ఘట్ కేసర్ దగ్గర క్యాబ్ ను అడ్డుకుని యువతిని రక్షించారు. అనంతరం విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో నివాసం ఉండే యువతి ఖాజీపేటలోని గణేష్ టెంపుల్ కు బయలుదేరింది. అయితే ఆమె బస్సు ఎక్కడం చూసిన ఆమె పరిచయస్తుడు శ్రీకాంత్, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించాడు. దీంతో దేవాలయానికి అని చెప్పడంతో ఆమెను బస్సులోంచి కిందకి దించి, తన క్యాబ్ లో తీసుకెళ్లాడు.

అక్కడ దర్శనం అనంతరం... దేవాలయానికి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒంటరిగా ఎవరిని కలవడానికి బయల్దేరావంటూ క్యాబ్ లో ఆమెను కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె 'అత్యాచార యత్నం' అంటూ మెసేజ్ ను పంపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకున్నారు.

కాగా, ఆ యువతికి, క్యాబ్ డ్రైవర్ అయిన శ్రీకాంత్ కి సంబంధం ఉందని, ఈ విషయం రెండు కుటుంబాలకు తెలుసని పోలీసులు తెలిపారు. అతని దెబ్బల నుంచి రక్షించుకోవదానికే అత్యాచారయత్నం జరుగుతోందంటూ మెసేజ్ పెట్టినట్టు విచారణలో ఆమె వెల్లడించిందని పోలీసులు చెప్పారు.

More Telugu News