: రైల్వే ఈ-టిక్కెట్లపై సర్వీసు చార్జ్ మినహాయింపు గడువు మరోమారు పొడిగింపు!

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే నిమిత్తం రైల్వే ఈ-టిక్కెట్లపై సర్వీసు చార్జ్ మినహాయింపు గడువును మరోమారు పొడిగించారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను ఐఆర్సీటీసీలో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సర్వీస్ చార్జ్ మినహాయింపును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు కొనసాగిస్తున్నామని పేర్కొంది. సెప్టెంబరు 30 వరకు ఆన్ లైన్ లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సర్వీస్ చార్జ్ ఉండదని పేర్కొంది. కాగా, 2016 నవంబర్ 23 నుంచి రైల్వే ఈ-టిక్కెట్లపై సర్వీస్ చార్జ్ మినహాయింపు నిచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 31 వరకు, ఆపై జూన్ 30 వరకు ఈ అవకాశాన్ని పొడిగించారు. తాజాగా, సెప్టెంబరు 30 వరకు ఈ గడువును రైల్వేశాఖ పొడిగించడం గమనార్హం.

More Telugu News