: జీఎస్టీ హెల్ప్ లైన్ కు రోజుకు పదివేల ఫోన్ కాల్స్!

దేశ వ్యాప్తంగా జీఎస్టీ పన్ను విధానం కొత్తగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రేడర్లకు, పన్ను చెల్లింపుదారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జీఎస్టీ నెట్ వర్క్ చైర్మన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, హెల్ప్ లైన్ నెంబర్లకు రోజుకు సగటున పదివేల ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. నోయిడా నుంచి ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, సుమారు నాలుగు వందల మంది ఎగ్జిక్యూటివ్ లు వీటిని ఆపరేట్ చేస్తున్నారని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలతో కలిసి జీఎస్టీఎన్ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించినట్టు చెప్పారు.

More Telugu News