: చైనాపై ఆంక్షలు విధించడం ఖాయం: ట్రంప్ వార్నింగ్

చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కొరియాను నియంత్రించే విషయంలో చైనా ఏమాత్రం సహకరించడం లేదని... దీనికి చైనా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని... ఆ దేశంపై వాణిజ్యపరమైన ఆంక్షలు (చర్యలు) తప్పవని ట్రంప్ హెచ్చరించారు. వాణిజ్యపరంగా చైనాను దెబ్బకొట్టాలనే కోణంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్ననే ఆయన యూరప్ పర్యటనకు బయల్దేరారు. జర్మనీలోని హంబర్గ్ లో జరగనున్న జీ-20 సదస్సు కోసం ఆయన వెళ్లారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ కానున్నారు. కానీ, ఈలోగానే చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

More Telugu News