: ఇజ్రాయెల్‌లోని భారతీయులపై మోదీ వరాల జల్లు.. టెల్ అవీవ్ నుంచి భారత్‌కు నేరుగా విమాన సర్వీసులు!

ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ ఆ దేశంలోని భారతీయ సంతతి ప్రజలకు ప్రత్యేక వరాలు ప్రకటించారు. ఇజ్రాయెల్‌లోని భారతీయులు తరచూ భారత్‌ను సందర్శించాలని మోదీ కోరారు. వారి కోసం త్వరలోనే టెల్ అవీవ్ నుంచి ఢిల్లీ, ముంబైలకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. భారత సంతతి ప్రజలకు  ఇజ్రాయెల్ ప్రభుత్వం జారీ చేసే ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఓ) కార్డుల జారీని మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇజ్రాయెల్ సైన్యంలో తప్పనిసరి ఆర్మీ సర్వీసులను పూర్తి చేసుకున్న భారతీయులకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓసీఐ కార్డులను జారీ చేస్తుంది. కాగా, ఇజ్రాయెల్‌లో భారత సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేస్తామని కూడా మోదీ హామీ ఇచ్చారు. ఆ దేశంలోని భారత సంతతి వ్యక్తులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి 6 వేల మంది భారతీయులు హాజరయ్యారు. మోదీ వెంట ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కూడా ఉన్నారు.

More Telugu News