: ప్రపంచాన్ని భారత్ పక్కదోవ పట్టిస్తోంది: చైనా

అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రపంచాన్ని భారత్ పక్కదోవ పట్టిస్తోందని చైనా ఆరోపించింది. సిక్కిం సెక్టార్ లోని చికెన్స్ నెక్ ప్రాంతంలో చైనా సైనికులు రోడ్డును నిర్మిస్తున్నారని... దీని వల్ల తమ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ భారత్ ప్రచారం చేస్తోందని విమర్శించింది. డొక్లాం ప్రాంతం భూటాన్, చైనా, ఇండియాల ట్రై జంక్షన్ లో ఉందంటూ ఇండియా చెబుతోందని... ఇది 1890 సైనో-బ్రిటన్ కన్వెన్షన్ ను అగౌరవ పరచడమేనని మండిపడింది.

1890 కన్వెన్షన్ ప్రకారం తూర్పు పర్వతాల నుంచి సిక్కిం సెక్షన్ ప్రారంభమవుతుందని... తాము రోడ్డును నిర్మిస్తున్న ప్రాంతం గిప్మోచీ పర్వతానికి 2 వేల మీటర్ల దూరంలో ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జనరల్ షువాంగ్ తెలిపారు. ట్రై జంక్షన్ కు, తాము రోడ్డును నిర్మిస్తున్న ప్రాంతానికి సంబంధం లేదని అన్నారు. 

More Telugu News