: రూ. 3,300 నుంచి రూ. 2.17 లక్షల వరకూ తగ్గిన టాటా మోటార్స్ కార్ల ధరలు

వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత, తమకు కలిగిన లాభాన్ని కస్టమర్లకు బదలాయించాలని నిర్ణయించిన టాటా మోటార్స్, ప్యాసింజర్ కార్లపై ఎంచుకున్న వేరియంట్ ను బట్టి రూ. 2.17 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 12 శాతం వరకూ ధరలను తగ్గిస్తున్నామని, లో ఎండ్ లో రూ. 3,300 ధర తగ్గుతుందని, హైఎండ్ కార్లపై రూ. 2.17 లక్షల ధర తగ్గనుందని సంస్థ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం అధ్యక్షుడు మయాంక్ పరేక్ వెల్లడించారు. జీఎస్టీని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన, ఇకపై కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించగా, మంగళవారం నాడు మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ వాహనాలపై 6.9 శాతం వరకూ ధరలను తగ్గించినట్టు పేర్కొంది.

More Telugu News