: హైదరాబాదులోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలపైనే కన్ను....గతంలో జరిగిన దోపిడీల వివరాలు!

అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాల కన్ను హైదరాబాదులోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలపై పడింది. తాజాగా హైదరాబాదులోని మైలార్ దేవ్ పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి ప్రయత్నించిన నేపథ్యంలో హైదరాబాదులోని ముత్తూట్ సంస్థలపై జరిగిన దోపిడీ ప్రయత్నాల వివరాల్లోకి వెళ్తే....
* 2014లో తిరుమలగిరిలోని మత్తూట్ ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ లో దోపిడీకి తొలిసారి దొంగల ముఠా ప్రయత్నించింది.
* 2015 ఫిబ్రవరి 05న రామచంద్రాపురంలోని ముత్తూట్‌ శాఖలో దోపిడీ జరిగింది. ఈ సందర్భంగా సుమారు రెండున్నర కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు.
* అదే ఏడాది మే 30న కూకట్‌ పల్లిలోని మినీ ముత్తూట్ ఫిన్ కార్ప్ లో దోపిడీకి దొంగలు యత్నించారు.
* ఆ తరువాత 2016 డిసెంబర్ 28న రామచంద్రాపురం మత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి తెగబడ్డ దొంగలు 42 కేజీల బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఇదే అతిపెద్ద దొపిడీ కేసు. దీనిని పోలీసులు ఛేదించి, ముంబైలో కర్ణాటకకు చెందిన లక్ష్మణ్ ముఠాను అరెస్టు చేశారు.
* అనంతరం తాజాగా జూన్ 4న మైలార్ దేవ్ పల్లి మత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి ప్రయత్నం జరిగింది. మేనేజర్ అప్రమత్తంగా ఉండి, అలారం మోగించడంతో స్థానికులు రావడంతో దోపిడీ దొంగలు పరారయ్యారు. బంటి, సర్దార్ అనే అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

More Telugu News