: 'రుక్మిణి' ఉపగ్రహంతో డ్రాగ‌న్‌పై నిఘా!

హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలో బ‌లగాల మోహ‌రింపు, సిక్కింలో భార‌త సైన్యంపై దౌర్జ‌న్యం వంటి మితిమీరుతోన్న చైనా ఆగ‌డాల‌ను క‌ట్ట‌డి చేసేందుకు భార‌త‌నేవీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న అమ్ములపొదిలోని జీశాట్‌-7 శాటిలైట్‌ను రంగంలోకి తీసుకొచ్చింది. `రుక్మిణి` పేరుతో పిలిచే ఈ శాటిలైట్ ద్వారా చైనా మిల‌ట‌రీ కార్య‌క‌లాపాల‌పై ఓ క‌న్ను వేయ‌నుంది.
2,625 కేజీల బరువుండే ఈ శాటిలైట్‌ను సెప్టెంబ‌ర్ 29, 2013న ప్ర‌యోగించారు.

అప్ప‌టినుంచి హిందూ మ‌హాస‌ముద్రంపై దాదాపు 2 వేల నాటిక‌ల్ మైళ్ల మేర ప్రాంతాన్ని ప‌ర్య‌వేక్షిస్తూ భార‌త‌నేవీకి స‌హాయ‌ప‌డుతోంది. సాంకేతికంగా ఇన్‌శాట్ 4ఎఫ్ అని పిలిచే ఈ శాటిలైట్ ఎప్ప‌టిక‌ప్పుడు హిందూ మ‌హాస‌ముద్రంపై ఉన్న నౌక‌లు, బ‌ల‌గాలు, స‌బ్‌మెరైన్ల స‌మాచారాన్ని చేర‌వేస్తుంటుంది. కేవ‌లం ఇండియ‌న్ ఆర్మీకే కాకుండా స‌ముద్రాంత‌ర క‌మ్యూనికేష‌న్‌, నిఘా అవ‌స‌రాల‌కు కూడా రుక్మిణి ఉప‌యోగ‌ప‌డుతోంది.

More Telugu News