: కుంబ్లే, కోహ్లీ మధ్య గొడవ గురించి చెప్పలేను కానీ... ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో వారిద్దరూ మాట్లాడుకోలేదు: బీసీసీఐ మేనేజర్ నివేదిక

టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో చోటు చేసుకున్న వివాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని బీసీసీఐ మేనేజర్ కపిల్ మల్హోత్రాను ఆదేశించింది. దీంతో ఆయన జట్టులోని సభ్యులందరితో సమావేశమై చర్చించారు. అనంతరం పూర్తి నివేదికను బీసీసీఐకి అందజేశారు. ఇందులో కుంబ్లే, కోహ్లీ దేనిపై గొడవపడ్డారు, ఎంత తీవ్రతతో గొడవపడ్డారు? అన్న విషయాన్ని వ్యక్తిగతంగా తాను చెప్పలేనని నివేదికలో తెలిపారు.

అయితే ఇంగ్లండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో కనీసం వారిద్దరూ మాట్లాడుకోలేదన్న మాట నిజమేననీ నివేదించారు. టోర్నీ జరిగినన్ని రోజులూ  ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ఆయన అందులో పేర్కొన్నారు. అయితే ఆ ప్రభావం జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ పై పడలేదని, జూనియర్లకు కోచ్ లు కుంబ్లే, బంగర్, శ్రీధర్‌ తో పాటు సీనియర్ ఆటగాళ్లు ధోనీ, యువరాజ్‌ తమ భావాలు, అనుభవాలు, వ్యూహాలు పంచుకుంటూ దిశానిర్దేశం చేశారని ఆయన నివేదిక సమర్పించారు. 

More Telugu News