: 'నిన్నిక్కడే చంపేయగలను' అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేకు కశ్మీర్ మంత్రి బెదిరింపు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సాక్షిగా బెదిరింపుల పర్వం కొనసాగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే...జీఎస్టీ అమలుపై కశ్మీర్ లో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్టీ సవరణపై జమ్మూకశ్మీరు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐటీ మంత్రి ఇమ్రాన్‌ అన్సారీ ప్రతిపక్ష నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు దేవేందర్‌ రాణా నుద్దేశించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై రాణా ప్రతిస్పందనగా తానేమీ పన్నులు ఎగ్గొట్టలేదని మంత్రిని ఎత్తిపొడిచారు. అంతే, ఇమ్రాన్ మరింత కోపోద్రిక్తుడై... ‘‘నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలన్నీ నాకు తెలుసు. నీకన్నా పెద్ద దొంగ ఎవడూ లేడు. మోబిల్‌ ఆయిల్‌ అమ్ముకుంటూ బిజినెస్‌ ప్రారంభించావు. ఈ సంపదంతా ఎలా పోగేసుకున్నావ్‌?’’ అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. దీంతో సభలో అలజడి రేగింది. 

More Telugu News