: 'ఎమ్మెల్యే' సినిమా ఫస్ట్ లుక్ విడుదల!

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో కల్యాణ్‌ రామ్‌ సరసన కాజల్‌ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఈ రోజు క‌ల్యాణ్ రామ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశాడు. ఈ లుక్ అభిమానుల‌కు న‌చ్చుతుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. కల్యాణ్‌రామ్‌, కాజల్‌ జంటగా గ‌తంలో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమా వ‌చ్చిన విష‌యం విదిత‌మే. రెండోసారి ఈ జోడీ జ‌త‌క‌డుతోంది. మ‌ణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.    

More Telugu News