: వేగంగా నిండుతున్న ఆల్మట్టి, కిన్నెరసానికి పోటెత్తిన వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి డ్యామ్ కు భారీ ఎత్తున వరదనీరు వస్తోంది. ఈ సీజన్ లో తొలిసారిగా ఆల్మట్టికి వస్తున్న వరద 40 వేల క్యూసెక్కులను దాటింది. ఈ ఉదయం 41,901 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా, 129 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న జలాశయంలో నిల్వ ఉన్న నీరు 23.50 టీఎంసీలకు చేరింది. మరోవైపు జూరాలకు 807 క్యూసెక్కులు, తుంగభద్రకు 9,149 క్యూసెక్కుల నీరు వస్తోంది.

 ఇక గోదావరి బేసిన్ విషయానికి వస్తే, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని పోటెత్తింది. పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం ఏకంగా 397.80 అడుగులకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ఎగువప్రాంతం నుంచి మరింతగా వరదనీరు వచ్చే అవకాశాలు ఉండటంతో గేట్లను ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పెన్నా బేసిన్ లోని కండలేరు, ఏలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు మాత్రం ఇంతవరకూ వరద నీటి చుక్క లేదు.

More Telugu News