: సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత.. హిందూ మహాసముద్రంలోకి చైనా యుద్ధ నౌకలు!

భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత, ఇరు దేశాల సైనికుల స్టాండాఫ్, నేతల మాటల తూటాల మధ్య చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. భారత్‌తో అనుకోని సమస్యలు ఎదురైతే ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తమ యుద్ధ నౌకలను హిందూ మహాసముద్రంలోకి పంపింది. ఇండియన్ ఓషియన్ రీజియన్ (ఐవోఆర్)లో వాటి కదలికలను భారత్ స్పష్టంగా గమనించింది. చైనా చర్యలను భారత్ నేవీ క్షుణ్ణంగా గమనిస్తోంది. ఐవోఆర్‌లో గస్తీ కాస్తున్న ఇండియన్ నేవల్ ఉపగ్రహమైన రుక్మిణి (జీశాట్-7) గత రెండునెల్లలో ఐవోఆర్‌లో చైనాకు చెందిన 13 యద్ధ నౌకలను గుర్తించింది. వీటిలో అత్యంత శక్తిమంతమైన లుయాంగ్-3 క్లాస్ గైడెడ్-మిసైల్ డెస్ట్రాయర్ కూడా ఉన్నట్టు నేవీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News