: పాకిస్థాన్ మాకు ఆయుధాలు ఇవ్వడం లేదు.. కశ్మీరీలు ఇచ్చిన డబ్బుతో మేమే కొనుక్కొంటున్నాం... ఉగ్రనేత సలాహుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ మరోమారు భారత్‌పై తనకున్న ఆగ్రహాన్ని బయటపెట్టాడు. సోమవారం జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్‌పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించాడు. పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న వారిని, భారత దళాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిని, రాజకీయ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. కశ్మీర్ పోరాటానికి పాకిస్థాన్ కేవలం  నైతిక, రాజకీయ మద్దతు మాత్రమే ఇస్తోందని విమర్శించాడు. ఒకవేళ పాకిస్థాన్ కనుక తమకు మద్దతు తెలిపి ఉంటే కశ్మీర్‌ను ఎప్పుడో స్వాధీనం చేసుకుని ఉండేవాళ్లమని ప్రగల్భాలు పలికాడు.

పాకిస్థాన్ తమకు ఆయుధాలు సమకూరుస్తోందన్న వార్తలను ఉగ్రనేత ఖండించాడు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తాము ఆయుధాలు కొనుగోలు చేసుకుంటామని పేర్కొన్నాడు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కశ్మీరీలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు చెప్పాడు. అంతేకాదు కావాల్సినంత డబ్బు ఇస్తే ఏ ఆయుధం కావాలంటే దానిని తక్షణమే తెచ్చిస్తానని ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.

More Telugu News