: మైక్రోసాఫ్ట్‌లో త్వరలోనే భారీగా ఉద్యోగాల కోత!

సేల్స్‌ఫోర్స్‌ను పునర్వ్యస్థీకరణ చేసే ప్రక్రియలో భాగంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగులను తొలగించనుంది. టెక్‌ క్రంచ్ రూపొందించిన రిపోర్టు ప్రకారం కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ ఇందుకు సంబంధించిన ప్ర‌క‌టన చేయ‌నుంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో కస్టమర్ యూనిట్, దాని ఎస్‌ఎంఈ కేంద్రీకృత విభాగాలు విలీనమవుతున్నాయ‌ని తెలిపింది. మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ అంశంపై స్పందించ‌డం లేదు. 2015 జూన్‌లో మైక్రోసాఫ్ట్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్ర‌క‌ట‌నలో మొత్తం 7,400 ఉద్యోగాలకు 2016లో కోత పెట్టబోతున్నట్లు పేర్కొంది. అన్న‌ట్లుగానే కొన్ని పొజిషన్లను తొలగించింది. ఆ ఉద్యోగాల తొల‌గింపు ప్ర‌క్రియ‌ను 2017 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయ‌నుంది.  

More Telugu News