: భారత్, చైనాల మధ్య యుద్ధం తథ్యం కావచ్చు : చైనా నిపుణుల హెచ్చరిక

భూటాన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ డోకా లా ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డును భార‌త సైన్యం అడ్డుకుంటున్న నేపథ్యంలో మూడు దేశాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. భార‌త జ‌వాన్లే అక్ర‌మంగా త‌మ భూభాగంలోకి ప్ర‌వేశించార‌ని చైనా ద‌ళాలు మ్యాప్‌ విడుదల చేయడమే కాకుండా, ఇండియన్ జ‌ర్నలిస్టుల‌ ప్ర‌వేశాన్ని కూడా చైనా ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో భార‌త్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. యుద్ధ ప‌రిస్థితి వ‌స్తే చైనా, పాక్‌ల‌ను ఎదుర్కునేందుకు భార‌త ఆర్మీ సిద్ధ‌మ‌ని ఇండియన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల కూడా చైనా స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది.

ఈ ప‌రిస్థితుల‌పై స్పందించిన చైనా నిపుణులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డోకాలా వివాదంపై ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ విష‌యంలో ఇరు దేశాలు వెన‌క్కి త‌గ్గేలా లేవ‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే యుద్ధానికి కూడా వెళతాయని, డోకాలా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను స‌రిగా తీర్చుకోలేక‌పోతే యుద్ధం ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు చెప్పారు. ఇరు దేశాలు ఆ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని సూచించారు.               

More Telugu News