: దక్షిణ చైనా సముద్రంలో యూఎస్ వార్ షిప్... యుద్ధ విమానాలు పంపిన చైనా

దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద దీవి సమీపానికి అమెరికా యుద్ధ నౌక వెళ్లగా, చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ స్టెథెమ్ వార్ షిప్, చైనా, తైవాన్, వియత్నాంలు తమదంటే తమదంటున్న ట్రిటాన్ ఐలాండ్ కు 12 నాటికల్ మైళ్ల సమీపంలోకి వెళ్లింది. దీనిపై స్పందించిన చైనా, అమెరికా రెచ్చగొడుతోందని, ఈ తరహా చర్యలు మానుకోవాలని సూచించింది. డొనాల్డ్ ట్రంప్, క్సీ జిన్ పింగ్ మధ్య ఫోన్ సంభాషణలకు కొన్ని గంటల ముందు యుద్ధ నౌక వచ్చిందని తెలుస్తోంది.

దాన్ని తరిమేందుకు చైనా నౌకలతో పాటు యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఈ విషయాన్ని చైనా రక్షణ శాఖ ప్రతినిధి లూ కాంగ్ స్పష్టం చేస్తూ, తమ జలాల్లోకి ఏ యుద్ధ నౌకనూ అనుమతించేది లేదని, తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించినట్టు క్సిన్హువా న్యూస్ ఏజన్సీ పేర్కొంది. ఈ తరహా రెచ్చగొట్టే చర్యలను వెంటనే మానుకోవాలని ఆయన సూచించినట్టు వెల్లడించింది. కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు సంచరిస్తుండటం, చైనా వాటిని అడ్డుకోవడం ఇదే తొలిసారేమీ కాదు.

More Telugu News