: విమానాల తరహాలో రైళ్లలో ఎకానమీ క్లాస్ టికెట్లు

ఎయిర్ లైన్స సంస్థలు తమ విమానాల్లోని సీట్లను లగ్జరీ, ఎకానమీ తరగతులుగా విభజించి ప్రయాణికులకు సేవలందిస్తాయి. ఇదే విధానాన్ని ఇండియన్ రైల్వేస్ కూడా అందుకుంది. విమానాల తరహాలో ఎకానమీ ఏసీ క్లాస్‌ ను రైలులో అందుబాటులోకి తేనుంది. 3 ఏసీ టారిఫ్‌ కన్నా తక్కువ చార్జీలను వసూలు చేస్తూ దీనికి ఆదరణ పెంచుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

గరీబ్ రథ్, దురంతో తరహాలో పూర్తిస్థాయి ఏసీ రైలులో ఏసీ-1, ఏసీ-2, ఏసీ-3 తో పాటు ఎకానమీ క్లాసులు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఎకానమీ ఏసీ కోచ్‌ లలో ప్రయాణించేవారికి ప్రత్యేకంగా దుప్పట్లు అవసరంలేదని చెప్పారు. ఎందుకంటే ఈ కోచ్‌ లలో మరీ వణుకుపుట్టించేంత ఏసీ సరఫరా కాదని వారు అన్నారు. ఈ ఎకానమీ తరగతిలో కోచ్ టెంపరేచర్ 24-25 డిగ్రీల మధ్య ఉంటుందని వారు అన్నారు. అంతే కాకుండా ఈ ట్రైన్ లో సిబ్బందికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రితూ బెరీ రూపొందించిన డిజైనర్ వేర్ ను యూనిఫాంగా అందజేయనున్నామని వారు వెల్లడించారు. 

More Telugu News