: మా దేశంలో పెళ్లి కాకుండా సహజీవనాన్ని అనుమతించం!: ఫిలిప్పీన్స్ వాసులకు యూఏఈ వార్నింగ్!

ఫిలిప్పీన్స్ వాసులకు యూఏఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ ను ఇతర దేశాల వారు కూడా గుర్తుంచుకోవాలని సూచించింది. వివరాల్లోకి వెళ్తే... ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వివిధ వర్గాలకు చెందిన కార్మికులు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇలా దుబాయ్ వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే గల్ఫ్ దేశాలకు వచ్చిన వారికి అక్కడి చట్టాలపై అవగాహన ఉండడం లేదు. ప్రధానంగా ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే వారికి గల్ఫ్ చట్టాల గురించి ఏమాత్రమూ తెలియడం లేదట. దీంతో ఫిలిప్పీన్స్ నుంచి గల్ఫ్ వెళ్లిన యువతీ యువకులు వివాహం కాకుండానే ఆడ, మగ కలిసి ఒకే గదిలో నివసిస్తూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు.

వివాహం కాక ముందు లైంగిక సంబంధం కలిగి వుండడం అన్నది ఫిలిప్పీన్స్ లో చట్ట వ్యతిరేకం కాదు. కానీ గల్ఫ్ దేశాల్లో చట్ట వ్యతిరేకం, సంప్రదాయ వ్యతిరేకం. దీంతో అక్కడ అది తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలో పలువురు ఫిలిప్పీన్స్ యువతీ యువకులు వివాహం కాకుండా లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారని, కొందరు పిల్లల్ని కూడా కంటున్నారని పోలీసు విచారణలో తేలింది. దీంతో యూఏఈ నుంచి వారిని బహిష్కరిస్తూ...ఫిలిప్పీన్స్ వాసులతో పాటు విదేశీయులందరికీ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ చట్టాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు.

More Telugu News