: స్టంపింగ్ చేయని కారణంగా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా!

క్రీడా స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ శ్రీలంక జట్టు వికెట్ కీపర్ డిక్ వెల్లాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం జింబాబ్వే-శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో లంక స్పిన్నర్ ధనంజయ బౌలింగ్ లో జింబాబ్వే ఆటగాడు సోలామాన్ క్రీజ్ బయటకి వెళ్లి రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయాడు.

అయితే, బంతి అతనికి చిక్కకుండా కీపర్ డిక్ వెల్లా చేతిలో పడింది. బంతి చేతిలో పడగానే కీపర్ ఎవరైనా స్టంప్ చేస్తారు. కానీ డిక్ వెల్లా మాత్రం అలా చేయలేదు. కాసేపు అలాగే ఉండిపోయాడు. అనంతరం బ్యాట్స్ మన్ క్రీజులో చేరిన తరువాత స్టంప్ చేసి, అవుట్ అంటూ అప్పీలు చేశాడు. దీంతో అంపైర్ ధర్డ్ అంపైర్ కి నిర్ణయం అప్పగించాడు. దీంతో రీప్లే చేసిన థర్డ్ అంపైర్ డిక్ వెల్లా ఉద్దేశపూర్వకంగా స్టంప్ చేయలేదని గుర్తించి, రిఫరీకి విన్నవించాడు. దీంతో క్రీడా స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన డిక్ వెల్లా మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. 

More Telugu News