: ట్రంప్ దెబ్బకు దిగివచ్చిన పాకిస్థాన్... హఫీజ్ సయీద్ సంస్థపై నిషేధం

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో కాలుపెట్టిన శుభసందర్భంలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో పాకిస్థాన్ దిగొచ్చింది. ఉగ్రవాదులపై పాక్ చర్యలకు పూనుకోకుంటే... తామే ఆ పని చేయాల్సి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. డ్రోన్లతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగేందుకు వెనుకాడమని హెచ్చరించారు.

 దీంతో రంగంలోకి దిగిన పాక్ ముంబై పేలుళ్ల సూత్రధార సంస్థ అయిన తెహ్రీక్-ఇ-ఆజాదీ జమ్ము అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ఈ సంస్థ హఫీజ్ సయీద్ కనుసన్నల్లో నడుస్తోంది. అయితే ఇది తన పేరు మార్చుకుని జమాత్-ఉద్-దవా (జేయూడీ) గా పాకిస్థాన్ లో నడుస్తూ, కశ్మీర్ లో అల్లకల్లోలం రేపేందుకు పావులు కదుపుతూ ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కు అమెరికా దగ్గరవుతోందని, ఇది తమకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని భావించిన పాక్... అమెరికాకు విశ్వాసం కలిగే రీతిలో చర్యలు చేపట్టింది. దీంతో ఆ సంస్థను నిషేధించింది. 

More Telugu News