: చిన్నారి 'క్రిష్‌'లు... చిర‌కాలం జీవిస్తారట!

మీ పిల్లలు ఏ ప్ర‌శ్న అడిగినా వెంట‌నే స‌మాధానం చెప్తున్నారా? 'క‌్రిష్' సినిమాలో చిన్న హృతిక్‌లాగ పెద్ద త‌ర‌గ‌తి వాళ్ల హోం వ‌ర్క్ చేసేస్తున్నారా? మీరేం కంగారు ప‌డ‌కండి. వారి తెలివితేట‌లు వారికి దీర్ఘాయుష్షునిస్తాయి. అవును.. చిన్న‌త‌నంలో ఎక్కువ తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శించిన పిల్ల‌లు గుండె జ‌బ్బులు, ప‌క్ష‌వాతం వంటి రోగాల బారిన ప‌డే అవ‌కాశం చాలా త‌క్కువ‌ని బ్రిట‌న్‌లోని ఎడిన్‌బ‌రో విశ్వ‌విద్యాల‌యం శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌లో తేలింది.

స్కాట్లాండ్‌కు చెందిన 65 వేల మంది స్త్రీ, పురుషుల‌పై ప‌రిశోధ‌న చేసి ఈ విష‌యాన్ని క‌నుక్కున్నారు. వీరంతా త‌మ 11 ఏళ్ల వ‌య‌సులో అత్యుత్త‌మ తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శించిన వారే. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వారి ఆరోగ్య వివ‌రాలు గ‌మ‌నిస్తే వారికి గుండె, ఊపిరితిత్తులు, మెద‌డు సంబంధ జ‌బ్బులు సోకిన దాఖ‌లాలు లేవ‌ని తేల్చారు. దీని ప్ర‌కారం చూస్తే మీ చిన్నారి క్రిష్‌లు చిర‌కాలం జీవించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

More Telugu News