: 'యుద్ధానికి సిద్ధమే'నంటూ భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చైనా!

ఓ వైపు నుంచి పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు, మ‌రోవైపు చైనాతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్పడుతున్న నేప‌థ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ బిపిన్ రావత్ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఇరు దేశాల నుంచి ముప్పు ఏర్ప‌డితే ఎదుర్కొని యుద్ధం చేయ‌డానికి సిద్ధ‌మేన‌ని ఆయ‌న అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ వు ఖియాన్ నీతి కాస్త లేటుగా స్పందించారు.

భార‌త్‌ యుద్ధం గురించి మాట్లాడ‌డం మానుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతా రాహిత్యమని, బిపిన్ రావ‌త్ చరిత్ర చెప్పిన పాఠాల గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం సిక్కింలోని డోంగ్‌లాంగ్ ప్రాంతంలో భార‌త్‌, చైనా దేశాల దళాలు మోహరించ‌డంతో బిపిన్ రావత్ ఈ రోజు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.      

More Telugu News