: మంత్రి ఈటలను అభినందిస్తున్నా.. కేసీఆర్ మళ్లీ తొందరపడుతున్నారు: రేవంత్ రెడ్డి

జీఎస్టీ విషయంలో తొందరపడవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు మరింత పెరుగుతాయని... రైతుల కష్టాలు మరింత పెరుగుతాయని చెప్పారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలంటూ కేసీఆర్ డిమాండ్ చేయాలని అన్నారు. దీనికి కేంద్రం ఒప్పుకోని పక్షంలో రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వరాదని... జీఎస్టీ ఆరంభ కార్యక్రమాన్ని బహిష్కరించాలని సూచించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా కేసీఆర్ ఇలాగే తొందరపడ్డారని, నోట్ల రద్దును సమర్థించారని... ఇప్పటికీ రైతులు నగదు కోసం అవస్థలు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం జీఎస్టీకి సంబంధించి వాస్తవాలను మాట్లాడుతున్నారని... ఈ విషయంలో ఆయనను అభినందిస్తున్నానని చెప్పారు.

More Telugu News