: పొగిడినా కూడా అర్థం చేసుకోలేదు.. రాహుల్ నిజంగానే ఓ ‘పప్పు’ : వినయ్‌ ప్రధాన్‌

త‌మ‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని వ్యాఖ్యానించి ఆ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్ ప్రధాన్ ఈ రోజు మ‌రోసారి అటువంటి వ్యాఖ్య‌లే చేశారు. త‌న నుంచి వివరణ కూడా తీసుకోకుండా త‌మ‌ పార్టీ కార్యకలాపాలన్నింటి నుంచి త‌న‌ను తీసేయడం ఏంట‌ని ఆయ‌న ఈ రోజు కూడా ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ సాధించిన విజయాలు, ఉపాధ్యక్షుడు గొప్పతనాన్ని చెప్పే సమయంలోనే తాను ‘పప్పు’ అని వ్యాఖ్యానించాన‌ని చెప్పారు. తాను రాహుల్ గాంధీని ప‌ప్పు అని అన‌డం వాళ్లకి తప్పుగా అనిపించిందని అన్నారు. త‌న మాట‌ల‌ను అలా అర్థం చేసుకుంటార‌ని తాను అనుకోలేని  చెప్పారు.

కొంతమంది నేత‌లు రాహుల్‌ చుట్టూ చేరి కాంగ్రెస్‌ పార్టీని సమూలంగా లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. తాను పొగిడినా కూడా అర్థం చేసుకోలేని వ్యక్తి నిజంగా ఓ ‘పప్పే’ అని ఆయ‌న ఉద్ఘాటించారు. రాహుల్ గాంధీని ఇక‌ తాను అలా పిలిచేందుకు సంకోచించబోన‌ని తెలిపారు. రాహుల్‌ నాయకత్వంపై త‌మ పార్టీ నేత‌లు అసంతృప్తిగా ఉన్నారని ఆయ‌న అన్నారు. తాను అందుకే రాహుల్‌కి వ్యతిరేకంగా పప్పు లేని భారత్‌ కావాలి అనే నినాదంతో ప్ర‌చారం చేపడుతాన‌ని తెలిపారు.      

More Telugu News