: ధనుష్ కి మంచి భార్యనవుతానని చెప్పి షాకిచ్చిన అమలాపాల్!

ధనుష్ కి మంచి భార్యనవుతానని చెప్పి అమలాపాల్ అందరికీ షాకిచ్చింది. 'వేలై ఇల్లా పట్టాధారి' ('వీఐపీ' తెలుగులో 'రఘువరన్ బీటెక్') సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న 'వీఐపీ-2' సినిమా ప్రమోషన్ ను అమలాపాల్ ప్రారంభించింది. ఈ మేరకు ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమలాపాల్ మొదటి భాగంలో ధనుష్ కు మంచి ప్రియురాలిగా నటించానని గుర్తుచేసింది. ఈ భాగంలో ధనుష్ ను వేధించే ఇల్లాలిగా కనిపిస్తానని చెప్పింది. మూడో భాగం తీస్తే అందులో ధనుష్ కు మంచి భార్యగా నటిస్తానని చెప్పింది.

కాగా, 'సుచీ లీక్స్' కారణంగా ధనుష్ తో అమలాపాల్ కు మంచి అనుబంధం ఉందంటూ గుసగుసలు వినిపించగా, ధనుష్ తో గడిపిన వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, అమలాపాల్ పెళ్లి పెటాకులు కావడం వెనుక కారణం కూడా ధనుషే అంటూ కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. 

More Telugu News