: ప్రధాన నిందితుడు పహిల్వాన్ నిర్దోషి... అక్బరుద్దీన్ పై హత్యాయత్నం కేసులో తీర్పు

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు తన తీర్పును వెలువరించింది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న నలుగురిని దోషులుగా తేల్చింది. కేసులో సలీం బిన్‌, అబ్దుల్లా, అవద్‌, హసన్‌ బిన్‌ దోషులని 7వ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు పేర్కొంది. వీరికి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పహిల్వాన్‌ నిర్దోషని న్యాయమూర్తి పేర్కొన్నారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని అభిప్రాయపడ్డ న్యాయస్థానం పహిల్వాన్ సహా పది మంది నిందితులపై కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు విచారణ సాగింది.

More Telugu News