: జూన్ 30న గ్ర‌హ‌శ‌క‌ల దినోత్స‌వం.. వేడుక‌ల లైవ్ టెలికాస్ట్‌!

జూన్ 30న జ‌ర‌గ‌నున్న గ్ర‌హ‌శ‌క‌ల దినోత్స‌వ వేడుక‌ల‌ను ఇంట‌ర్నెట్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న కేంద్రం నాసా తెలిపింది. జ‌పాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేష‌న్ ఏజెన్సీ, యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీలు కూడా ఈ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారంలో పాలుపంచుకోనున్నాయి. ఈ ప్ర‌సారంలో గ్ర‌హ‌శ‌క‌లాలు, వాటి పుట్టుపూర్వోత్త‌రాలు, భూమ్మీదికి గ్ర‌హ‌శ‌క‌లాలు వ‌చ్చే అవ‌కాశం ఉందా?, గ్ర‌హ‌శ‌క‌లాలు ప‌డిన‌పుడు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి? వ‌ంటి విష‌యాల‌తో విశ్వానికి సంబంధించిన అనేక సంగ‌తులు తెలియ‌జేయ‌నున్నారు.

గ్ర‌హ‌శ‌క‌లాల అధ్య‌య‌నం కోసం నాసా చేప‌ట్టిన `ఓసిరిస్‌-రెక్స్` మిష‌న్ 2018లో `గ్ర‌హ‌శ‌క‌లం బెన్ను`ను చేరుకోనుంది. ఈ సంద‌ర్భంగా మిష‌న్‌కు సంబంధించిన వివ‌రాల‌ను కూడా వెబ్‌లైవ్‌లో తెలియ‌జేయ‌నున్నారు. 2015 నుంచి ప్ర‌తి ఏడాది జూన్ 30న గ్ర‌హ‌శ‌క‌ల దినోత్స‌వం జ‌రుపుకుంటున్నారు. 1908, జూన్ 30న సైబీరియాలోని పొడ్క‌మెన్న‌యా తుంగుస్కా న‌దిలో 130 అడుగుల వెడ‌ల్పు ఉన్న గ్ర‌హ‌శ‌కలం ప‌డి, 2,072 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల మేర అడ‌విని నాశ‌నం చేసింది.  

More Telugu News