: టీమిండియా చీఫ్ కోచ్ గా దరఖాస్తు చేయాలని రవిశాస్త్రికి సూచించింది ఆయనేనట!

టీమిండియా ప్రధాన కోచ్ ప‌ద‌వి కోసం బీసీసీఐ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి తాను కూడా ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక టీమిండియా మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడ‌ట‌. అందుకే ర‌విశాస్త్రి గతంలో తాను చేసిన ఓ వ్యాఖ్య‌కు విరుద్ధంగా తాను కూడా రేసులో ఉండ‌నున్న‌ట్లు తెలిపారు.

గ‌తంలో రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవి ఇస్తే తీసుకుంటాను.. కానీ, అందు కోసం క్యూ లైన్లో నిల్చోన‌ని తేల్చిచెప్పారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న‌తో సచిన్ టెండూల్కర్ ఈ అంశంపై మాట్లాడ‌డంతో ర‌విశాస్త్రి త‌న మ‌నసు మార్చుకున్నార‌ని తెలిసింది. టీమిండియాకు రవిశాస్త్రి లాంటి వ్యక్తి కోచ్‌గా ఉంటే బాగుంటుంద‌ని స‌చిన్ భావించి ఆయ‌న‌తో మాట్లాడాడు. అందుకే, దరఖాస్తు చేయమని ర‌విశాస్త్రికి చెప్పాడట.            

More Telugu News