: ముంబై పేలుళ్ల కేసులో దోషి ముస్తఫా దొస్సా గుండెపోటుతో మృతి

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక దోషి ముస్తఫా దొస్సా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు మరణించాడు. గత రాత్రి 3 గంటల ప్రాంతలో హై ఫీవర్ కారణంగా ముంబైలోని జేజే హాస్పిటల్ కు దొస్సాను తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, తనకు బైపాస్ సర్జరీ చేయించాలంటూ ఇటీవల టాడా కోర్టుకు కూడా దొస్సా విన్నివించాడు.

ఈ ఉదయం జేజే హాస్పిటల్ లో దొస్సాకు చికిత్స అందించిన డాక్టర్ లహానే మాట్లాడుతూ, దొస్సా మధుమేహం, తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నాడని తెలిపారు. అతనిని అబ్జర్వేషన్ లో ఉంచి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఐసీయూలో దొస్సాను చేర్చాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఇంతలోనే, దొస్సా పరిస్థితి విషమించింది. కార్డియాక్ అరెస్టుకు గురైన అతను మృతి చెందాడు.

More Telugu News