: కుంబ్లే, రవిశాస్త్రి మధ్య తేడా ఇదే: ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ విశ్లేషణ

టీమిండియా చీఫ్ కోచ్ ప‌ద‌వికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన అనంతరం పలురకాల ఊహాగానాల, వివిధ విశేషాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ఇద్దరు కోచ్ ల మధ్య వ్యత్యాసాన్ని వివరించాడు. ఇద్దరితోనూ పని చేసిన శ్రీధర్ మాట్లాడుతూ, జట్టులోని ఆటగాళ్ల క్యారెక్టర్ ను రవిశాస్త్రి చూస్తారని, అందరూ తనలాంటి వాళ్లే ఉండాలనుకుంటాడని చెప్పాడు. అలాగే కుంబ్లే కూడా జట్టులోని ఆటగాళ్లంతా తనలాగే కష్టపడాలని కోరుకుంటాడని అన్నాడు.

అయితే ఇద్దరిలో ఎలాంటి పోలికలు లేవని, ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని చెప్పాడు. కెప్టెన్‌, టీమ్ ఏం చెబితే అది కుంబ్లే చేసి ఉంటే బాగుండేది అని పేర్కొన్నాడు. లీడర్ తన సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్లాలని, మార్పుని స్వీకరించాలని పేర్కొన్నాడు. టీమ్ డిమాండ్స్ ను బట్టి ఆటగాళ్ల సామర్థ్యం వెలికితీయాలని శ్రీధర్ పేర్కొన్నాడు. ఇప్పుడున్న జట్టుకు చాలా అనుభవం ఉందని, వాళ్ల అనుభవాన్ని గౌరవించి, జట్టుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాల్సిందని కుంబ్లే గురించి పేర్కొన్నాడు. దీంతో కుంబ్లే జట్టుతో కఠినంగా వ్యవహరించాడని, దీంతోనే ఆటగాళ్లు అతనిని ద్వేషించారని తెలుస్తోంది.   

More Telugu News