: 'దివ్య దర్శనం'తో పాటు ఉచిత లడ్డూలూ రద్దు: టీటీడీ నిర్ణయంపై విమర్శల వెల్లువ

వచ్చే నెల 7వ తేదీ నుంచి శుక్ర, శని, ఆది వారాల్లో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల నుంచి తిరుమల కొండకు కాలినడకన చేరుకునే భక్తులకు 'దివ్యదర్శనం' టోకెన్లను రద్దు చేయాలని నిర్ణయించుకున్న టీటీడీ, వారికి ఇచ్చే ఉచిత లడ్డూను కూడా రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. నడకదారిలో వచ్చే వారికి ఓ ఉచిత లడ్డూతో పాటు, మరో లడ్డూరు రూ. 10కి టీటీడీ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దివ్యదర్శనం రద్దుతో పాటు ఉచిత లడ్డూ కూడా రద్దయినట్టేనని టీటీడీ ప్రకటించడంతో, ఈ నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ నిర్ణయం గురించి జేఈఓ శ్రీనివాసరాజు ఈ ఉదయం ప్రకటించిన తరువాత, తిరుమలలో భక్తులు టీటీడీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

More Telugu News