: పాలకమండలిలో లేనట్టైతే నేను కూడా కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసేవాడిని : గుంగూలీ

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, కోచ్ రేసులో రవిశాస్త్రి చేరడంపై మీడియా ప్రశ్నకు దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ముంబైలో జరిగిన బీసీసీఐ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, బీసీసీఐ పాలకమండలిలో సభ్యుడిని కాకపోయి ఉంటే తాను కూడా టీమిండియా చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసి ఉండేవాడినని అన్నాడు. కోహ్లీ-కుంబ్లే వివాదాన్ని బీసీసీఐ మరింత మెరుగ్గా పరిష్కరించి ఉండాల్సిందని గంగూలీ తెలిపాడు. బీసీసీఐ మరింత పరిణతితో వ్యవహరించి ఉంటే వివాదం రేగి ఉండేది కాదని గంగూలీ బీసీసీఐకి అక్షింతలు వేశాడు. కాగా, గతంలో తనను కాదని కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేసినప్పుడు గంగూలీపై రవిశాస్త్రి తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News