: 17 పార్టీలు అండగా నిలువగా, మీరా కుమార్ నామినేషన్

వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీయే తరఫు అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ తో తలపడేందుకు విపక్ష యూపీఏ తరఫున లోక్ సభ మాజీ స్పీకర్, బాబూ జగ్జీవన్ రామ్ తనయురాలు మీరా కుమార్ కొద్ది సేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. విపక్షంలోని 17 పార్టీలు ఆమెకు మద్దతు పలికాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. శరద్ పవార్, మల్లికార్జున ఖర్గే, కనిమోళి, సీతారాం ఏచూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ, దేశంలో కుల వివక్షను రూపుమాపడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికను దళిత్ వర్సెస్ దళిత్ గా అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను నేడు సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తానని మీరా కుమార్ తెలిపారు.

More Telugu News