: ఇంగ్లండ్ రికార్డు స్థాయి స్కోరు...రెండు సెంచరీలతో కదంతొక్కిన బ్యాట్స్ వుమన్

మహిళల వన్డే ప్రపంచకప్‌ లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు అద్భుతం చేసింది. ఇద్దరు బ్యాట్స్ వుమన్ హీథర్‌ నైట్‌ (106), స్కీవెర్‌ (137) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ జట్టు రికార్డు స్థాయి స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో హీథర్ నైట్, స్కీవెర్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 29.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

ఈ దశలో భారీ వర్షం స్టేడియాన్ని ముంచెత్తడంతో ఆట నిలిచిపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ విజేతగా ఇంగ్లండ్ నిలిచిందని ప్రకటించారు. దీంతో ఇంతవరకు మహిళా వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5వ జట్టుగా ఈ మ్యాచ్ తో ఇంగ్లండ్ నిలిచింది. కాగా, 2016లో కూడా ఇంగ్లండ్ చేతిలో భారీ పరాజయాన్ని పాక్ జట్టు మూటగట్టుకోగా, ఈ జాబితాలో స్థానం సంపాదించిన టాప్ ఐదు జట్లలో నాలుగు జట్లు పాక్ మీదే అత్యధిక స్కోరు రికార్డు సాధించడం విశేషం. 

More Telugu News