: ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘పెట్యా’ వైరస్.. భారత్ పై కూడా దాడి!

ఇటీవల 'వాన్నా క్రై' వైరస్ ప్రపంచాన్ని వణికించిన సంగతిని మర్చిపోక ముందే మరో సైబర్ దాడి ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. 'పెట్యా' రాన్సమ్ వేర్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ తొలుత ఉక్రెయిన్ పై పంజా విసిరి, ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ యూరప్ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఈ రాన్సమర్ వేర్... భారత్ ను కూడా టార్గెట్ చేసిందని స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ తెలిపింది.

పెట్యా హిట్ లిస్టులో భారత్ ఉందని హెచ్చరించింది. ఇప్పటికే బ్రిటన్, రష్యాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. యూరప్ లోని పలు సెంట్రల్ బ్యాంకులు, పెద్దపెద్ద సంస్థలపై దాడి జరిగినట్టు సమాచారం. రష్యాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ 'రాస్నెఫ్ట్' ఇప్పటికే సైబర్ దాడికి గురైంది. మన దేశం విషయానికి వస్తే, దేశంలోనే అతిపెద్ద కంటెయినర్ పోర్టు అయిన 'జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్'పై సైబర్ దాడి జరిగినట్టు తెలుస్తోంది.  

More Telugu News