: అన్నం పెట్టమన్నా పెట్టరు... అందుకే ప్లాన్ చేసి ఇలా చేశాం!: నిజాంపేట్ 'నారాయణ' విద్యార్థులు

హైదరాబాద్ నిజాంపేటలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాల భవనంలో వీరంగం సృష్టించిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థులు తమ ఆగ్రహానికి కారణాలను మీడియా ముందు ఏకరవు పెట్టారు. అన్నం చాలినంత పెట్టడం లేదని, ఇంకొంచెం పెట్టాలని అడిగినా పెట్టడం లేదని, పెట్టే అన్నం, కూరలు రుచిగా ఉండవని, పురుగులు వచ్చాయని చూపిస్తే, అది చింతపండు పుల్ల అని తీసి పారేశారని విద్యార్థులు ఆరోపించారు. రెండు నెలల సెలవుల తరువాత తాము వస్తే, హోం సింక్ హాలిడేస్ ఇవ్వలేదని, కేవలం జూనియర్లకు మాత్రమే సెలవులిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పిందని అన్నారు.

తల్లిదండ్రులు వస్తే, వారికి కనీస గౌరవం ఇవ్వడం లేదని, తమ ముందే వారిపై ఫీజుల కోసం కేకలేస్తూ, జులుం చేస్తారని ఆరోపించారు. గంట పాటు బయటకు వెళ్దామన్నా తమకు స్వేచ్చ లేదని వాపోయారు. యాజమాన్య వైఖరికి నిరసగానే ప్లాన్ చేసి ఈ పని చేశామని తెలిపారు. మొత్తం 400 మంది ఉన్న హాస్టల్ లో బాత్ రూములు సరిగ్గా లేవని, చాలినన్ని నీళ్లు రావని ఆరోపించారు. ఈ ఘటన తరువాత విద్యార్థులకు హోం సిక్ లీవ్ లు ఇచ్చి వారిని బయటకు పంపించి వేశారు.

More Telugu News