: ముందు రజనీకాంత్ ను రంగంలోకి దిగమనండి.. ఆ తర్వాత ఆలోచిద్దాం!: అమిత్ షా

దక్షిణాదిన మరింత బలం పెంచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ శూన్యత ఉన్న తమిళనాడులో ఈసారి ఎలాగైనా పట్టు పెంచుకునే క్రమంలో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు తమిళ రాష్ట్రాల (తమిళనాడు, పుదుచ్చేరి) పర్యటనకు గాను ఆయన తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.

అన్నాడీఎంకే అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని... అయితే, తమిళ ప్రజల మేలు కోసం తాము అండగా ఉంటామని షా చెప్పారు. తమిళనాడులో క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని... బూత్ స్థాయి నుంచి టీమ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిలకు వేర్వేరుగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ముఖ్యంగా తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం, అధికారంలోకి రావడం కోసం ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ ను రూపొందించామని వెల్లడించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రజల్లో ఎంతో ఫాలోయింగ్ ఉందని అమిత్ షా చెప్పారు. అయితే, ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయంలో ఇంకా సందిగ్ధత ఉందని చెప్పారు. ముందు ఆయనను రాజకీయాల్లోకి రానివ్వండి... ఆ తర్వాత ఆలోచిద్దామని తెలిపారు. రజనీ ప్రకటన తర్వాతే తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. బీజేపీతో కలసి రజనీ పనిచేయాలనుకుంటే, ఆయనకు సమున్నతమైన స్థానాన్ని ఇస్తామని... ఈ విషయమై తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు.

More Telugu News