: మహారాష్ట్రలో వర్షాలతో.. గోదారమ్మ ఉరుకులు ... కృష్ణమ్మ పరుగులు!

గత రెండు రోజులుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ప్రవాహం మొదలైంది. ఈ ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తొలిసారిగా నీటి ప్రవాహం నమోదైంది. 600 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. సాయంత్రానికి ఈ ప్రవాహం మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టిలోకి నీరు రాకున్నా, దిగువన ఉన్న నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు ఇన్ ఫ్లో నమోదవుతోంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహం పెరిగింది. నారాయణపూర్ కు 111 క్యూసెక్కులు, జూరాలకు 3,252 క్యూసెక్కలు, తుంగభద్రకు 1,338 క్యూసెక్కులు, శ్రీశైలానికి 1,119 క్యూసెక్కుల నీరు వస్తోంది. పెన్నా నదిలో మాత్రం ఇప్పటికింకా చుక్క నీరురాలేదు.

More Telugu News