: గిరిజనులు మరణించాక స్పందించడం సరికాదు: అధికారులతో సీఎం చంద్రబాబు

విశాఖ మన్యం పరిధిలోని చాపరాయిలో డయేరియా కారణంగా 16 మంది గిరిజనులు మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గిరిజనులు మరణించాక యంత్రాంగంలో కదలిక రావడం సబబు కాదని అధికారులకు సూచించారు. గిరిజనుల ఆరోగ్యంపై ఎంత త్వరగా స్పందించామనేదే ముఖ్యమని అన్నారు. ఐటీడీఏల పీవోలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, ఏడు ఐటీడీఏల పరిధిలోని గ్రామాల్లో గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆ శాఖకు, గిరిజన శాఖకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు.

More Telugu News