: ‘కోచ్‌గా నన్ను ఎంపిక చేయండి.. కోహ్లీని సరైన దారిలో పెడతా’ అంటూ బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్న ఇంజనీర్!

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్ కోసం బీసీసీఐ రెండో సారి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ప‌దవి ‌కోసం తాను కూడా పోటీలోకి దిగుతానని పేర్కొంటూ ఓ ఇంజ‌నీర్ బీసీసీఐకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. ఆ వ్య‌క్తి పేరు ఉపేంద్రనాథ్‌ బహ్మచారి. ప‌శ్చిమ బెంగాల్‌కి చెందిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం మహారాష్ట్రలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

టీమిండియాకి పెద్ద పేరున్న వ్య‌క్తి కోచ్‌గా రావాల‌ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భావిస్తున్నాడ‌ని, త‌న పేరు చాలా పెద్దదని ఆ ఇంజ‌నీర్ బీసీసీఐకి విన్న‌వించుకున్నాడు. కాబట్టి తాను ఆ పదవికి అర్హుడినేన‌ని, ఒకవేళ బీసీసీఐ మాజీ క్రికెటర్‌ని కోచ్‌గా ఎంపికచేస్తే అది అనిల్‌ కుంబ్లేని అవమానించినట్లేన‌ని అన్నాడు. త‌న‌ను ఆ ప‌ద‌వికి తీసుకుంటే మాత్రం ఎలాంటి బాధలూ ఉండవని ఆయ‌న పేర్కొన్నాడు. త‌నలాంటి వారే కోహ్లీ లాంటివారిని సరైన దారిలో పెట్టగల‌ర‌ని ఆయ‌న అన్నాడు.             

More Telugu News