: గూగుల్ కు భారీ జరిమానా విధించిన ఈయూ!

గూగుల్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ ఈ రోజు భారీ జ‌రిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న‌ షాపింగ్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని, ప‌లు సంస్థ‌ల‌కు అక్ర‌మంగా ల‌బ్ధిని చేకూర్చుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై యురోపియ‌న్ యూనియ‌న్ సుదీర్ఘ విచార‌ణ జ‌రిపింది. చివ‌ర‌కు గూగుల్ అందిస్తోన్న ఆ స‌ర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన ఈయూ ఆ సంస్థ‌కి ఏకంగా 2.4 బిలియ‌న్ యూరోల జ‌రిమానా విధించింది. గూగుల్ త‌మ సెర్చింజ‌న్‌లో చూపించిన ఆన్‌లైన్ షాపింగ్‌ స‌ర్వీస్ సంస్థ‌ల పేర్లు ఇత‌ర సంస్థ‌ల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని తేల్చింది.   

More Telugu News